భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: రాంపూర్‌లో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. గురువారం తాండూర్ మండలం ద్వారకపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో జరుగుతున్న రీసర్వే తీరును మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. గ్రామంలో చేపట్టే రీసర్వేకు ముందుగా రైతులకు సమాచారం అందించాలన్నారు. వారి సమక్షంలో పారదర్శకంగా సర్వే చేపట్టి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో తహసీల్దార్ జ్యోత్స్న,…