భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ ఆకాంక్షించారు. గురువారం నాడు సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి, వార్డు సభ్యులు కలిసి స్థానిక అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై గంగారపు కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.…





