భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: ఆగ్నేయ బంగాళాఖాతంలో త్వరలోనే వాతావరణ మార్పులు సంభవించనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. ఈ అల్పపీడనం తరువాతి 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు…





