భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada)లో భారీ అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. నెహ్రూచౌక్‌ సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో జూనియర్‌ కళాశాల, ఎస్‌బీఐ శాఖ ఉన్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని కథనాలు:

Panchayat elections: రెండో దశ పంచాయతీ పోరు నేడే