భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన చేపట్టనున్న బంద్‌ను జయప్రదం చేయాలని కనిగిరి డివిజన్ ప్రధాన కార్యదర్శి కె. పాండురంగారావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. మార్కాపురం మెడికల్ కాలేజీతో సహా అన్ని మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, జీవో నెంబర్ 77కు వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రకాశం జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీ నిర్మాణం, కనిగిరి నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.…