భారత్ సమాచార్.నెట్, గుంటూరు: అనుమానం, ఆస్తి వివాదాల కారణంగా భార్యను గొడ్డలితో నరికి చంపిన కేసులో నిందితుడు నూతలపాటి వెంకటేశ్వర్లుకు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికళ్యాణ చక్రవర్తి జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వట్టిచెరుకూరు మండలం, సౌపాడు ఎస్సీ కాలనీకి చెందిన నూతలపాటి వెంకటేశ్వర్లు, నూతలపాటి మౌనికకు 2016 జనవరి 9న వివాహమైంది. వివాహ సమయంలో వెంకటేశ్వర్లు తండ్రి తన పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని కోడలు మౌనిక…





