భార‌త్ సమాచార్.నెట్, గుంటూరు: కొల్లిపర పోలీసులు గంజాయి విక్రేతలతో పాటు వినియోగదారులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ద‌నరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం 13మందితో కూడిన గంజాయి ముఠాను పట్టుకున్న తెనాలి పోలీసులు, వారి విచారణలో మరికొంత మంది సభ్యులున్నట్లు గుర్తించారు. ఈ సమాచారంతో దర్యాప్తు కొనసాగించి, కొల్లిపరకు చెందిన శోభన్‌బాబు, రుషిబాబు, రాజ్‌కుమార్,…