భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం గ్రామ పంచాయతీలో జరగనుంది. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆశీస్సులతో, ప్రజల సహకారంతో గెలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించాలని కోరారు. వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రేపు మేనూర్ సర్పంచ్ ప్రమాణ స్వీకారం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




