భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఉద్ఘాటించారు. స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ, యువత, ప్రజలు, ఆటో డ్రైవర్లు, సిబ్బంది సహా సుమారు 460 మంది స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందించదగ్గ…