భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల టౌన్ 21వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యాంక్ తిమ్మయ్య పుట్టినరోజు వేడుకలు నూనెపల్లెలో ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై తిమ్మయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి కేక్ కట్ చేసి వేడుకను నిర్వహించారు. పార్టీ నేతలు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.