భార‌త్ స‌మాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో భారీ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. మే 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ మేళా కొనసాగనుంది. ప్రముఖ 1M1B సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మేళాలో…