భారత్ సమాచార్, ఏపీ: ప్రధాని మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా పర్యట నలో భాగంగా గురువారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయానికి చేరుకున్న మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు.

 

తరువాత మూలవిరాట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన,…