భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు జగదీష్, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం వారు మంచాలమ్మ దేవి, మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతి వారిని ఆశీర్వదిస్తూ మంత్రాక్షతలు అందజేశారు. భక్తుల రద్దీ మధ్య దర్శనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు నరసింహమూర్తి, వ్యాసరాజస్వామి పాల్గొని…