భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 450 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదలచేసింది. డిగ్రీ అర్హతతో ఈ పరీక్షకు పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.48 వేల వేతనం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు.
అసిస్టెంట్లుగా చేరినవారు బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తారు. వీరు మూడేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత శాఖాపరమైన…





