భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు ప్రొఫెషనల్ క్రికెట్ అకాడమీ, నంద్యాల రోడ్‌లో ఈ నెల 31న కావ్య ఈవెంట్స్ ఆధ్వర్యంలో “స్పార్క్ మిక్స్–2026” పేరిట జబర్దస్త్ అండ్ మ్యూజిక్ నైట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సంధ్య విక్రమ్ కుమార్‌ను ఆహ్వానించగా, ఆమె చేతుల మీదుగా స్పార్క్ మిక్స్ ఈవెంట్ టికెట్ రివీల్ చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ నాని, హరీష్ రామాయణం, మోహన్ కృష్ణలు సంధ్య విక్రమ్ కుమార్‌ను ఆహ్వానించగా, ఆమె తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని హామీ…