భారత్ సమాచార్.నెట్, అనంతపురం : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి జేసీ ఉమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం జేసీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ…





