భారత్ సమాచార్.నెట్, వనపర్తి: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్‌తో సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఎఫ్ఐఆర్ నుంచి కేసు పూర్తయ్యేంతవరకు సాక్ష్యాధారాల సేకరణ, డాక్యుమెంట్ల సమర్పణలో కోర్టు పోలీసు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులతో పాటు నాన్-బెయిలబుల్ వారెంట్స్ (NBW)ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వరావు, సీఐ నరేష్ సహా…





