భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు విమర్శించారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల జయప్రదం కోసం, న్యూ సిటీ చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కృష్ణానగర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అంజిబాబు, నగర ప్రధాన కార్యదర్శి ఆర్. నరసింహులు మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి విశాఖపట్నంలో జరగనున్న మహాసభలకు కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో…





