భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఈ నెల 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల, డివిజన్ మరియు మున్సిపల్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన…