భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా సాధన కోసం 78వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన బీసీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతాలైనందున ఆదోని జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీని కలిసినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని…