భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నదిలో దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నీట మునిగి గల్లంతయ్యారు. హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్ బజార్‌కు చెందిన చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (31) అన్నదమ్ములుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్మలు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.






