భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని దుర్గామాత అమ్మవారి బండ్ల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం గ్రామస్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వరంగల్, సిద్దిపేట ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు…