భారత్ సమాచార్, విశాఖపట్నం జిల్లా: పెందుర్తి మండలం సరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిపై విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. పాఠశాలలో చదువుతున్న కొందరు బాలికలు ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన కారణంగా పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లల నుంచి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

తల్లిదండ్రుల కథనం ప్రకారం, పాఠశాలలో సుమారు 37 మంది విద్యార్థులు చదువుతుండగా, గత ఏడాది నుంచి ప్రధానోపాధ్యాయుడిగా…