భారత్ సమాచార్.నెట్, వరంగల్‌: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. వర్షం తగ్గినప్పటికీ, వరంగల్ నగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ములుగు క్రాస్ రోడ్ జంక్షన్‌తో పాటు హన్మకొండలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి వర్షం తగ్గిపోవడంతో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి.

మ‌రిన్ని క‌థ‌నాలు

ప్రేమికురాలు దక్కదనే ఆవేదనతో యువకుడు…