భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఆదోనిలో వైఎస్ఆర్సిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి పేరుతో ప్రత్యేక అర్చనలు జరిపి, అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాయిప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం జీవనజ్యోతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో పేదలకందించిన సంక్షేమం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. నవరత్నాల…