భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు. ప్రతి సమస్యపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం తగిన…






