భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి మొత్తం ఏడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ వెల్లడించారు.
ఎంపీడీవో కుమార్తో పాటు 28 శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం అందిన దరఖాస్తుల వివరాలను ఎంపీడీవో…






