భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామంలో తాను సర్పంచిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పించాలని కోరుతూ హేమ్లతండ మాజీ సర్పంచి బానోతు వీరన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ఆయన ఈ ఫిర్యాదును సమర్పించారు.
తాను సర్పంచిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో హేమ్లతండ అభివృద్ధి కోసం పలు పనులు చేపట్టానని, అయితే వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని వీరన్న తన వినతిలో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రస్తుత సర్పంచి…





