భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పుస్తకాల్లో చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాటిపై పూర్తి అవగాహన పెంచుకునే ఉద్దేశంతో మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చేగుంటలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించి రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా రేషన్ షాపు ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం వివరాలను విద్యార్థులు తెలుసుకున్నారు. ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి? వాటి ఆధారంగా…