భార‌త్ స‌మాచార్, అంత‌ర్జాతీయం : అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలించాయి. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అనూహ్య విజయాలు సాధించి కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిపైనా ఆధిపత్యం సంపాదించింది. రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లోనూ డెమొక్రాట్లు పాగా వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలతో ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలంలోని మిగిలిన రెండేళ్లు మరింత సవాళ్లతో నిండే అవకాశం కనిపిస్తోంది.

సెనేట్‌లో మొత్తం 100 స్థానాలకు గాను మెజారిటీకి 51 సీట్లు…