భారత్ సమాచార్, మెదక్ జిల్లా: “ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం ఆ ఆటవిక కాలం నాటి పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నాయి” అని మెల్లూరు గ్రామ పంచాయతీ శివారులోని పిట్టల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటుతున్నా తమకు కనీసం ఇందిరమ్మ ఇల్లు గానీ, ఇండ్ల వరకు రహదారి గానీ నిర్మించలేదని వారు ఆరోపించారు. అడవిలో దొరికే పిట్టలు, పండ్లు అమ్ముకుంటూ పొట్ట గడుపుతున్నామని.. ప్రస్తుతం కోతుల బెడద వల్ల ఆ ఆధారం కూడా పోయిందని…