భారత్ సమాచార్.నెట్, మెదక్: మంజీరా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో చేపల వేటకు వెళ్లిన యువకుడు బుడ్డంగుల సురేష్ (23) గల్లంతయ్యాడు. కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన సురేష్, ఆనకట్ట వద్ద ప్రమాదవశాత్తు నది ప్రవాహంలో పడిపోయాడు.

స్థానికుల సమాచారం మేరకు, కొల్చారం ఎస్సై మొహియుద్దిన్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

నరేందర్ రెడ్డికి జిల్లా కమిటీలో చోటు కల్పించాలి