భారత్ సమాచార్.నెట్, నంద్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ వెంకటేశ్వరరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. రోగుల సమస్యలపై ధర్నా నిర్వహించిన అనంతరం విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా, ఆర్‌ఎంవో దానిని తీసుకోవడానికి నిరాకరించడంపై సీపీఎం మాజీ జిల్లా నాయకులు మస్తాన్‌వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని మస్తాన్‌వలి మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మంత్రి, కలెక్టర్ కఠినంగా స్పందించాలని, వెంటనే డాక్టర్‌పై తగు చర్యలు తీసుకోవాలని…