భారత్ సమాచార్, అమరావతి: అమరావతి రాజధానిలో జర్నలిస్టుల కోసం ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీనియర్ జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2019లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 30 ఎకరాల భూమిలో హ్యాపీనెస్ట్ నమూనాలో బహుళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ 2019లో అప్పటి…





