భారత్ సమాచార్, జాతీయం : రామమందిర ప్రారంభోత్సవానికి, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అయోధ్య సర్వం సిద్ధమైంది. అయోధ్య పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లది హిందువులు ఈ వేడుకల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని 11 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలను జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పంపింది. అలాగే రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీల కుటుంబ సభ్యులకు సైతం ఆహ్వానాలు పంపడం విశేషం.
అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే…




