భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల వేధింపులు తట్టుకోలేక రజిని అనే మహిళా ఏఎన్ఎం శుక్రవారం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. అధికారుల ఒత్తిడి, మానసిక వేధింపుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.

ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సౌజన్య, శిరీషలు తనను విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రజిని ఆరోపించారు. అనవసర ఒత్తిడి భరించలేక మెట్‌ఫార్మిన్ మాత్రలు మింగిన ఆమెను, తోటి సిబ్బంది గమనించి వెంటనే జిల్లా ఆసుపత్రికి…