భారత్ సమాచార్, తిరుపతి జిల్లా: భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో అరెస్ట్ కావడం ఖాయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జా కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పలు అంశాలపై స్పందించారు.

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నందుకే రాజకీయ కక్షతో…