భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. హత్నూర మండల పరిధిలోని మంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మల్లేష్ తన పొలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే ధాన్యాన్ని తీసుకువచ్చి నెలరోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడటంతో మరింత మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో…