భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. భైంసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ముధోల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రాగి తీగల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.
…





