భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 8వ వార్డు మన్సూపూర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగరాజు కారు గుర్తుకు ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం నాగరాజు తమ గ్రామానికి చెందినవాడు అని, ఆయనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి చేస్తానన్నారు.