భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. 20 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పుంగనూరు పోలీసులకు దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు పట్టుపడగా మరో ముగ్గురు పారిపోయారు. నిందితుల నుంచి రూ.33లక్షల విలువైన ఎర్రచందనం సహా ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
రాజంపేట నుంచి పుంగనూరు మీదుగా కర్ణాటకకు అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్ల కారు అర్ధరాత్రి సమయంలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట…





