భారత్ సమాచార్, మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మండలం కుర్వపల్లిలో వరుణ్ తేజ్ అనే బాలుడి మృతికి కారణమైన ఆర్ఎంపీ శశి కిరణ్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ మంగళవారం జాతీయ బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో నకిలీ డాక్టర్ల ఆగడాలను అరికట్టి, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని కథనాలు:





