భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. శనివారం మాటేగాం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు.

విచారణలో నిందితులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. లోకేశ్వరం మండలం రాయ్‌పూర్…