భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: నార్సింగి మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన అమ్మమ్మ యూసుబీ, మనమరాలు హజీరా నీటిలో మునిగి మృతి చెందారు. కాలుజారి చెరువులో పడిపోయిన అమ్మమ్మను రక్షించే ప్రయత్నంలో ఈత రాని మనవరాలు కూడా నీటిలో కొట్టుకుపోయింది. చెల్లెలు సబియా చెట్టుకొమ్మను పట్టుకొని బయటపడింది. గ్రామస్థులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు:
గెలిపిస్తే రూ.25 లక్షలిస్తా..! గ్రామస్తులకు సర్పంచ్ ఆశావహుడి ఆఫర్

