భార‌త్ స‌మాచార్.నెట్, నిజామాబాద్: అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఈ వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరి జిల్లా మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
నిలిచిపోయిన రాక‌పోక‌లు
నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌ కు వెళ్లే…