భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: భార్య తనతో కలిసి ఉండటం లేదనే కక్షతో.. భార్యాపిల్లలతో పాటు అత్తమామలను ఒకేసారి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన ఒక కిరాతకుడి ఉదంతం హత్నూర మండలం దౌలాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అదనపు కట్నం వేధింపులకు తోడు కుటుంబ మొత్తాన్ని అంతం చేయాలని చూసిన నిందితుడు మన్నె నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు, దౌలాపూర్కు చెందిన లావణ్యతో 2018లో వివాహం జరిగింది.…





