భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: ఖమ్మం నగరంలో దారుణ హత్య కలకలం రేపుతోంది. కొత్త మున్సిపాలిటీ దగ్గర ,లయన్స్ క్లబ్ పక్క సందులో భార్యను గొంతు కోసి భర్త భాస్కర్ అతి కిరాతకంగా హత్య చేసాడు. మొదట కన్న కూతురుని చంపేందుకు తండ్రి ప్రయత్నించగా చిన్నారి చాకచక్యంగా తప్పించుకుంది. ఈ ఘటనలో చిన్నారికి మూడు చేతి వేళ్ళు తెగి పోయాయి.  అనంతరం భార్యను హత్య చేసాడు. పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.…