భారత్ సమాచార్, క్రైమ్: ఓ రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన ముంబైలోని పోవాయ్ ప్రాంతంలో జరిగింది. పోవాయ్ ప్రాంతంలోని రాజీవ్ చంద్రకాంత్, షాలిని దేవి(54)ని 1993లో వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా 1995 నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. గత రాత్రి, రాజీవ్ కొన్ని పత్రాలను సేకరించడానికి పోవాయ్‌లోని తన భార్య ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో షాలినిపై దాడి చేసిన రాజీవ్, దిండుతో ఆమెను ఊపిరాడకుండా చేసి చంపాడు.…