భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గణిత శాస్త్రం ద్వారా మనకు ఎదురయ్యే అనేక సవాళ్లకు సులువైన పరిష్కారాలను కనుగొనవచ్చని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ శివాజీ గణేష్ తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన ‘పాక్షిక అవకలన సమీకరణాలు (పీడీఈలు), వైవిధ్య విశ్లేషణ’ అంశంపై ప్రసంగించారు. ‘‘ఒక ఆలోచన, మూడు సమస్యలు, ఒక పద్ధతి’’ అనే సూత్రంతో గణిత సమస్యలను పరిష్కరించే విధానాలను వివరించారు.
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లోని గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన…





