భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, పారిశ్రామికాభివృద్ధి ద్వారా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలిపారు. హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘థెరా నిమ్ బయోలాజిక్స్’ (Thera Nym Biologics) పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి ఆవుల…